‘నిన్నుకోరి’ బాలీవుడ్ లొకి వెళ్లనుంది

SMTV Desk 2017-09-06 16:02:35  nani, natural star, ninnukori, konavenkat, bollywood remake, sanjay leela bhansali

హైదరాబాద్ సెప్టెంబర్ 6 : నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నిన్నుకోరి’ చాలా మంచి టాక్ తో అన్ని చోట్ల మంచి కలెక్షన్ లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్‌ లొకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్ర రచయిత కోన వెంకట్ సంజయ్ లీల భన్సాలీ తో చర్చించినట్లు తెలుస్తోంది. కథ విన్నపుడు సంజయ్ లీల భన్సాలీ కి తను తెరకెక్కించిన ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ లా అనిపించడం తో ఒకసారి సినిమా చూసారట, ఆ తర్వాత సంజయ్ సినిమా చూసిన తరువాత క్లారిటీ వచ్చి సినిమా ని రీమేక్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. హిందీ రీమేక్ లో పాత్రలో వరుణ్‌ ధావన్‌ నటించనున్నట్లు టాక్.