మోక్షజ్ఞ లాంచింగ్ త్వరలోనే

SMTV Desk 2017-09-06 12:11:44  balayya, nandamuri balakrsihna, mokshagna, mokshagna launching

హిందూపురం సెప్టెంబర్ 6 : సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉదయం అభిమానులతో కలిసి కేక్ కట్ చేసారు. ఈ సందర్బంగా బాలయ్య మాట్లాడుతూ, నందమూరి అభిమానులు మోక్షజ్ఞ లాంచింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, వారందరి కోరిక త్వరలోనే నెరవేరుతుందని చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లినా మోక్షజ్ఞ సినిమా ఎప్పుడన్న ప్రశ్న ఎదురవుతుందని, వచ్చే సంవత్సరం జూన్ కల్లా ఓ మంచి బ్యానరులో తొలి చిత్రం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. పైసా వసూల్ సినిమా తో వచ్చిన బాలయ్య బాబు తన తరువాత సినిమా బోయపాటితో చేయనున్నారు.