పవన్ నన్ను పార్టీలోకి అందుకే పిలవట్లేదనుకుంటా: నాగబాబు

SMTV Desk 2017-09-06 11:43:49  pavan kalyan, janasena, tdp, bjp, ap politics, special status

హైదరాబాద్ సెప్టెంబర్ 6: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీని సర్వ సన్నద్ధం చేస్తున్నారు. ఇందుకు తగిన కార్యాచరణ, ప్రణాళిక, వ్యుహాల్లో పార్టీ నేతలు మునిగితేలుతున్నారు. అయితే ఈ సందర్భంలో పవన్ చిన్న అన్నయ్య నాగబాబు పవన్ పార్టీలోకి ఎందుకు వెళ్లడం లేదు అనే అంశం పై వివరణ ఇచ్చారు. ఆరెంజ్ సినిమా నిర్మించి చాలా నష్టపోయానని ఆ సమయంలో పవన్ తనకు ఎంతో ధైర్యం చెప్పారని అన్నారు. అయితే ఈ నష్టాలను పూడ్చడానికి బుల్లి తెర తనకు ఎంతో సహాయపడిందని తెలిపారు. పవన్ పార్టీలోకి వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదుకానీ.. తాను ఒక వేల వెళితే తన వల్ల పార్టీకి లాభం చేకూరకపోయినా పర్వాలేదు గానీ, నష్టం మాత్రం చేకూరవద్దని కోరుకుంటున్నాను కాబట్టే పార్టీలోకి వెళ్లడం లేదని నాగబాబు స్పష్టం చేశారు. వాస్తవానికి వెండి తెర కంటే బుల్లి తెరపైనే నాగబాబు ఆర్థికంగా బాలా నిలదొక్కుకున్నారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.