విలన్ పాత్రలో నటిస్తున్న సుదీప్

SMTV Desk 2017-09-06 11:05:51  salman khan , kichha sudeep. tiger zindha hain, katrina kaif

ముంబాయి సెప్టెంబర్ 6 : ‘ట్యూబ్ లైట్’ చిత్రoతో ఓటమిని చూసిన సల్మాన్ భాయి ఈ సారి ఎలా అయిన హిట్ కొట్టాలన్న ధీమా తో ఉన్నాడు. 2012 లో విడుదలై మంచి విజయం సాధించిన ఈయన చిత్రం ‘ఏక థా టైగర్’ కు కొనసాగింపుగా వస్తున్న ‘టైగర్ జిందా హై’ చిత్రం వస్తుంది. ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కిచ్చ సుదీప్ నటిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఏజెంట్‌ జహీర్‌ పాత్రలో సుదీప్‌ కనిపించనున్నారట. ఈ సినిమాలో నటించడానికి పెద్ద మొత్తంలో పారితోషకం తీసుకున్నారని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సుదీప్ విలన్ పాత్రలో నటిస్తారని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి విశాల్‌-శేఖర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. డిసెంబరు 22న ఈ చిత్రం విడుద‌ల‌ కానుంది.