నేడు మీడియా ముందుకు గౌతం రెడ్డి

SMTV Desk 2017-09-05 15:45:33  gowtham reddy, ysrcp, jagan, andhra politics, political news

విజయవాడ సెప్టెంబర్ 5: వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బెజవాడ వైకాపా నేతల మధ్య లడాయి కి కారణమైన వైకాపా నేత గౌతం రెడ్డి నేడు మీడియా ముందుకు రానున్నారు. మొన్న గౌతం రెడ్డి వంగవీటి రంగా కుటుంబం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ కూడా ఆయన్ని సస్పెండ్ చేసింది. గౌతం రెడ్డి వ్యాఖ్యలతో ఒక్క సారిగా బెజవాడ మొత్తం రణరంగంగా మారింది. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను సైతం ఏర్పాటు చేశారు. అయితే తన వ్యాఖ్యలు రంగా కుటుంబ సభ్యులను బాధించి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. కాగా దీనిపై వివరణ ఇవ్వడానికి అయన నేడు మీడియా ముందుకు రానున్నారు.