రోబో 2 లో ఒక్క పాట ఖర్చు రూ.32 కోట్లా..?

SMTV Desk 2017-09-04 16:56:44  robo2, 2.O, rajinikanth, akshay kumar, ami jackson,

చెన్నై సెప్టెంబర్ 4 : శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్ లు లీడ్ రోల్స్ లో ‘2.ఓ’ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ‘2.ఓ’ సినిమాలో ఓ భారీ బడ్జెట్ సాంగ్ కనువిందు చేయనుందట. అయితే ఈ ఒక్క సాంగ్ కే 32 కోట్లు ఖర్చు పెట్టారన్న వార్త వినిపిస్తుంది. ‘ధూమ్ 3’ చిత్రంలో ఒక్క పాటను 5 కోట్లతో తెరకెక్కిస్తే అదే దేశంలో కాస్ట్లీ సాంగ్ గా ప్రచారం పొందితే, ఇపుడు ఏకంగా రెండు మూడు చిన్న సినిమాల తీసే బడ్జెట్ తో ఒక్క పాటను తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి భారీ పాటను వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతోంది 2.ఓ టీం. ప్రస్తుతం 32 కోట్ల పాటకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నా.. చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు. కానీ అభిమానుల్లో మాత్రం ఈ చిత్రం పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మరి ఆ స్థాయిలో ఈ సినిమా ఉంటుందో చూడాలంటే ఇంకా నాలుగు నెలలు ఎదురు చూడాలి.