రోడ్డుపై గుంతలా..? అయితే ఫోటో తీయండి..వెంటనే క్యాష్ ప్రైజ్ గెలుచుకోండి...!!

SMTV Desk 2017-09-04 16:39:19  congres party, telangana congres. ktr, roads hyderabad, hyderabad

హైదరాబాద్ సెప్టెంబర్ 4: ప్రస్తుత వర్షా కాలంలో హైదరాబాద్ నగరంలో రోడ్లు ఎంత అస్తవ్యస్తంగా తయారవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మీరు గుంతలు పడ్డ రోడ్లను మీ కేమరాతో క్లిక్ మనిపించి, క్యాష్ ప్రైజ్ గెలుపొందమని బంపర్ ఆఫర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు పంపిన ఫోటో బాగుంటే గనక మీరు రూ.5000 ల వరకు గెలుచుకునే అవకాశం మీకు లభిస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మర్రి ఆదిత్య రెడ్డి వివరించారు. అయితే దీనికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని ఇది కేవలం సామాజిక సమస్యలపై అవగాహన కోసం మాత్రమే అని ఆయన అన్నారు. అయితే ఇలా తీసిన ఫోటోలను hydpothole@gmail.com కి మెయిల్ చెయ్యాలని, ఇందులో మొదటి బహుమతిగా రూ.5000 లను, రెండో బహుమతిగా రూ.2500 ఇస్తామని ఆయన ప్రకటించారు. బర్ 4: