2004-2014 మధ్య బాబు మీరు ఎన్ని సార్లు ఓడిపోయారో మీకు తెలుసా..?

SMTV Desk 2017-09-04 15:50:55  andhra pradesh, mudhragada, chandhrababu, ysrcp, tdp, ap politics

ఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ 4: ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు గెలుపు పరంపర లో మునిగి తేలుతున్నారని గతంలో 2004-2014 మధ్య కాలంలో ఎన్ని సార్లు ఓడిపోయారో మీకు గుర్తుందా..? అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. కాపులను బీసీ జాబితాలో చేర్చకుండా బాబు నాన్చుడు ధోరణి అవలంబిస్తూ ఉన్నారని, కాపులు అమ్ముడుపోయారంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని... తమ జాతిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. నాన్చుడు ధోరణి వదిలేసి ఇప్పటికైనా కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాపులు అమ్ముడు పోయారని చంద్రబాబు చేస్తున్న ప్రచారం అత్యంత దారుణమని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమానికి మేము పనికిరామని బాబు భావిస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నేతలతో రాజీనామా చేయించి వారికి ఉద్యమ బాధ్యతలను అప్పగించాలని అన్నారు. వంగవీటి రంగా పై గౌతం రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ముద్రగడ ఖండించారు.