మళ్ళీ సినిమా నిర్మాణం పై దృష్టి పెట్టిన నాని

SMTV Desk 2017-09-04 10:45:22  nani, natural star, prashanth varma, mca, krushnarjuna yuddam, producer, new producer, producer nani

హైదరాబాద్ సెప్టెంబర్ 3: నాని ఇప్పుడు సక్సెస్ లో మునిగితెలుతున్నాడు. పట్టిందల్లా బంగారం అయినట్టు, అయన ప్రతి సినిమా హిట్ అవుతూనే ఉంది., కానీ తన సక్సెస్ లో తన స్టొరీ సెలక్షన్ కి క్రెడిట్ ఇవ్వక తప్పదు. ఆయనికి చిత్ర నిర్మాణం పై ఆసక్తి ఉంది, ఇదివరకు ‘డి ఫర్‌ దోపిడి’ చిత్ర నిర్మాణం లో భాగం పంచుకున్నారు. కానీ ఆ సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తరువాత తన దృష్టి సినిమాల పైనే పెట్టాడు. అయితే ఇపుడు మళ్ళీ నానీ సినిమా నిర్మాణం పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. కాగా తాను కథానాయకుడిగా నటించబోయే సినిమానే నిర్మించనున్నట్టు సమాచారం. కథ పై నమ్మకం తో సొంతంగా నిర్మించాలని నాని అనుకుంటున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలున్నాయి. నాని ప్రస్తుతం ‘ఎం.సీ.ఏ’ మరియు ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలలో నటిస్తున్నారు.