సామరస్యంగా పరిష్కరించుకోవాలి!!

SMTV Desk 2017-06-04 12:03:40  central hom ministar, rajnath sing, ap bifercation

న్యూఢిల్లీ, జూన్ 4 : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న అంశాలను రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూచించారు.విభజన చట్టంలోని అన్ని అంశాలు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు. పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్న అంశాలను రెండు రాష్ట్రాలు సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మూడేళ్ళ పనితీరుపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానాలిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో అనేక అంశాలు ఉన్నాయని, అందులో అనేకం పరిష్కారమయ్యాయని, మిగిలిన అంశాలను రెండు రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకోవాలన్నారు.