చిరు సడన్ సర్ ప్రైజ్ తో షాక్ అయిన పవన్...!

SMTV Desk 2017-09-02 17:55:39  pavar star pavan kalyan, janasena pavan kalyan, birthday celebrations on pavan kalyan.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆ చిత్ర యూనిట్ ను సర్ ప్రైజ్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నయ్య, వదినలు రావడంతో చాలా సంతోషంతో పొంగిపోయారు పవన్. వారి రాకతో అక్కడ సెట్ లో పండుగ వాతావరణం నెలకొంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మధ్య రాజకీయపరమైన అభిప్రాయ భేదాలే తప్ప, ఇరువురి అనుబంధానికి సంబంధించినవి కావనే విషయం మళ్ళీ ఈ సారి కూడా స్పష్టమైంది.