ఎల్పీజీ సిలిండర్ ధర మరో సారి పెంపు

SMTV Desk 2017-09-02 17:22:05   LPG cylinder, Subsidy, Center decision

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2 : ప్రతి నెల కొద్ది మొత్తంలో ధరలను పెంచుతూ ఈ ఆర్థిక సంవత్సరాంతానికి అన్ని రకాల సబ్సిడీలను ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించిన వేళ ఎల్పీజీ సిలిండర్ల ధరలు మరో సారి పెరిగాయి. నెలవారి పెంపులో భాగంగా ప్రతి సిలిండర్ పై రూ. 7 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సబ్సిడీల ఎత్తివేత్త కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల సిలిండర్ వ్యాట్ కాకుండా రూ. 4 పెంచేందుకు దేశ చమురు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. గత ఏడాది జులై నుంచి పెంపును అమలు చేస్తుండగా ఇప్పటి వరకు సిలిండర్ ధర రూ. 68 పెరిగింది. చౌక ధరల దుకాణాల ద్వారా పంపీని చేసే కిరోసిన్ ధర కూడా లీటరుకు 25 పైసలు పెరిగింది. విమాన ఇంధనం ఏటీఎఫ్ కు కిలో లీటరుకు రూ.1090 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.