కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తో కేసీఆర్ భేటీ...!

SMTV Desk 2017-09-02 15:57:20  kcr,arun jaitly, national news, political news, kcr jitly

ఢిల్లీ సెప్టెంబర్2: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మర్యాద పూర్వకంగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ని కలిశారు. అయితే ఈ భేటీలో వారు పలు విషయాల గురించి చర్చించుకున్నారు. ఆ విషయాలను కేసీఆర్ మీడియా కు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నిర్మాణానికి బై సన్ పోలో మైదానాన్ని ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగిందని, ప్రజాపయోగ నిర్మాణాలపై జీఎస్టీ తగ్గించే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటామని జైట్లీ హామీ ఇచ్చారని కేసీఆర్ పేర్కొన్నారు. మేడ్చల్, కరీంనగర్ రోడ్డు విస్తరణకు భూములు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని కేసీఆర్ అన్నారు. ఈ నెల తొమ్మిది న హైదరాబాద్ లో జరిగే జీఎస్టీ మండలి భేటీ లో జీఎస్టీ పై నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తి మేరకే నిర్మాణాలపై జీఎస్టీ ని 18 శాతం నుండి 12 శాతానికి తగ్గించినట్టు జైట్లీ చెప్పారన్నారు. తన ప్రతిపాదనల పట్ల సానుకూలంగా వ్యవహరించినందుకు గాను సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.