అమెరికా వరద బాధితులను ఆదుకున్న ట్రంప్

SMTV Desk 2017-09-02 11:24:42  america, texas, harvey hariken, harvey thufan, trump,

అమెరికా, సెప్టెంబర్ 2 : అమెరికాలోని టెక్సాస్‌ ను అతలాకుతలం చేసిన హర్వేపెను తుఫాను కారణంగా సర్వం కోల్పోయిన ప్రజలను అందుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూ. 10 లక్షల డాలర్ల విరాళాలను ప్రకటించారు. తన వ్యక్తిగత ఖాతా నుంచి ఈ విరాళాలను సహాయ నిధికి ఇవ్వనున్నట్లు తెలిపారు. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద విపత్తుగా భావిస్తున్న హర్వే ధాటికి లక్షకు పైగా ఇండ్లు ధ్వంసం అవ్వగా, 16 వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. బాధితులను తక్షణం ఆదుకునేందుకు ఐదు వందల తొంబై కోట్ల డాలర్ల సాయం అందించాలని అమెరికా కాంగ్రెస్ ను ట్రంప్ ప్రతిపాదించనున్నారు. హర్వే పెను తుఫాను కారణంగా 38 మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు.