ఆ విషయం పై కాంప్రమైజ్ అవ్వను జైలుకు అయినా వెళ్తా: పవన్

SMTV Desk 2017-09-02 11:21:02  pavan kalyan, janasena, tdp, bjp, ap politics, special status

అమరావతి సెప్టెంబర్ 2: 2019 ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు సాధించబోతున్నారు..? ఈ ఎన్నికలపై మీ వ్యుహాలేంటి..? అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తే.. ఈ విషయం లో నా వ్యూహాలు నాకున్నాయి, నా లెక్కలు నాకున్నాయి అనే సమాధానం చెబుతున్నారు పవన్. నిన్న జనసేన డిజిటల్ విభాగంతో ముఖాముఖి సమావేశం అయిన పవన్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అయితే ఈ సమావేశంలో పవన్ ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేశారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అత్యవసరం అని ఈ విషయం లో కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదని అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఒక పక్క టీడీపీ, బీజేపీ ప్రత్యేక హోదా బదులు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని, ఆ వనరులతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని వారు చెబుతున్నా పవన్ మాత్రం మొండి పట్టుదల వదలడం లేదు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే ఒకవేళ ఎందుకు ఇవ్వలేక పోయిందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ విషయం పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో విభేదించిన పవన్ ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకునే 2019 ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది.