బాలికపై బీహారీల అత్యాచారయత్నం...తీవ్ర రక్తస్రావం కావడంతో!!!

SMTV Desk 2019-12-12 14:47:25  

పదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ఇద్దరు యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. అయితే పోలీసులు మిగతా ఫిర్యాదుల్లాగా దీన్ని వదిలేయకుండా వెంటనే స్పందించడంతో రెండు గంటల్లోనే నిందితులను పట్టుకుని బాలికను కాపాడగలిగారు. హైదరాబాద్‌లోని రహ్మత్‌నగర్‌ సమీపంలో గల జవహర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ బాలిక స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో స్టేషనరీ కొనుగోలు చేయడానికి షాప్‌కి వెళ్లింది. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న బాలికపై అదే ప్రాంతంలో హైదరాబాద్‌ బిర్యానీ హౌజ్‌ కిచెన్‌లో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన వరుసకు సోదరులైన అంజా (20), షంషాద్‌(22) కన్నేశారు. ఆమెను బలవంతంగా బైక్ ఎక్కించుకుని వెంకటగిరిలోకి తమ కజిన్ ఇంటికి తీసుకెళ్లారు. బాలికను ఇంట్లో బంధించి అత్యాచారం చేయబోయారు. అయితే ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడి వదిలేశారు. ఆ కామాంధుల బారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ బలవంతయ్య, ఎస్సై నవీన్‌రెడ్డి బాలికతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆమె చెప్పిన గుర్తుల ఆధారంగా వెంకటగిరిలోని గదిలో ఉన్న నిందితులు అంజా, షంషాద్‌లను అదుపులో తీసుకొన్నారు. నిందితులపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్‌ కేసులు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సకాలంతో స్పందించి కామాంధులను అరెస్ట్ చేయడంపై బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.