తుదిశ్వాస విడిచిన గొల్లపూడి మారుతీరావు

SMTV Desk 2019-12-12 14:44:59  

ప్రముఖ నటుడు రచయిత గొల్లపూడి మారుతీరావు (80) తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 250కిపైగా చిత్రాలో గొల్లపూడి నటించి అభిమానులను అలరించారు. ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయిత, నటుడిగా సుపరిచితుడయ్యాడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశాడు. సినీరంగంలో మొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది పురస్కారం అందుకున్నాడు. 1939 ఏప్రిల్ 14 తేదీన విజయనగరంలో గొల్లపూడి జన్మించాడు.