విజయారెడ్డిని కాపాడేయత్నంలో చంద్రయ్య మృతి

SMTV Desk 2019-12-02 15:45:43  

సుమారు నెలరోజుల క్రితం అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డిని సురేశ్ అనే రైతు ఆమె కార్యాలయంలోనే సజీవదహనం చేసిన్నప్పుడు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య కాంచన్‌బాగ్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు తెల్లవారు జామున ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. చంద్రయ్య వైద్యానికి ప్రభుత్వం తగినంత నిధులు విడుదల చేయకపోవడం వలననే మరణించాడని రెవెన్యూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అతను చనిపోవడంతో భార్యా పిల్లలు రోడ్డున పడ్డారని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తహశీల్దార్‌ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన సురేశ్, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె డ్రైవర్ గురునాధం కూడా తీవ్రగాయాలపాలై మృతి చెందిన సంగతి తెలిసిందే.