దిశా ఘటనపై వర్మ సంచలన ట్వీట్

SMTV Desk 2019-12-02 15:42:41  

యావత్ దేశంలో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ హత్య ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఇంతటి ఘోరానికి పాల్పడ్డవాళ్లను పిచ్చికుక్కల కంటే హీనులని పేర్కొన్న వర్మ, అలాంటి వాళ్లకు ఎంతటి దారుణమైన శిక్షలు వేయాలా అని ఆలోచించడం కంటే, మహిళలకు మరింత మెరుగైన రక్షణ కల్పించడం ఎలాగా అనే అంశంపై చర్చించడం మేలని వర్మ అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన ఘటనల నుంచి నేరస్తులు ఏం నేర్చుకోలేరని, ఆ విషయం 2012లో నిర్భయ ఘటన జరిగినప్పటినుంచి ఇప్పటివరకు చూస్తూనే ఉన్నామని వర్మ ట్వీట్ చేశారు. ఓ పిచ్చికుక్కను చూసి మరో పిచ్చికుక్క ఎలా నేర్చుకోలేదో, ఇదీ అంతేనని విశ్లేషించారు.