దుమ్ములేపుతున్న అర్జున్ సురవరం ...

SMTV Desk 2019-12-02 15:42:01  

నిఖిల్ కథానాయకుడిగా రూపొందిన అర్జున్ సురవరం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో వచ్చిన కనితన్ సినిమాకి ఇది రీమేక్. అదే దర్శకుడు తెరకెక్కించిన అర్జున్ సురవరం .. తమిళంలో కంటే తెలుగులో బాగా వచ్చిందనే టాక్ కూడా వినిపించింది. కొన్ని కారణాల వలన విడుదల విషయంలో జాప్యం జరిగినప్పటికీ, తొలిఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

తొలిరోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4.1 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేస్తూ నిఖిల్ ఒక పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశాడు. త్వరలోనే ఈ సినిమా లాభాల బాట పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు సినిమాలు వున్నాయి. ఇక ఆయన వాటిపై దృష్టిపెట్టనున్నాడు.