నెటిజెన్ కి గడ్డి పెట్టిన నిధి అగర్వాల్

SMTV Desk 2019-11-30 16:46:09  

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న అత్యాచార సంఘటనలు యావత్తు భారతదేశాన్నే కలచి వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దారుణ ఘటనల పట్ల తెలుసుకున్న అనేక మంది తమ అభిప్రాయాలను రకరకాలుగా వినిపిస్తున్నారు.తప్పు ఎవరిదీ అన్న అంశం పక్కన పెడితే దారుణం అయితే జరిగిపోయింది.ఇదిలా ఉండగా కొంతమంది సోషల్ మీడియాలో ఈ ఘటనలను తీసుకొచ్చి హీరోయిన్స్ మీద రుద్దుతున్నారు.తాజాగా ట్విట్టర్ లో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

ఆమెకు ఇప్పుడు జరిగిన విషాధ ఘటనపై మాట్లాడుతూ మీలాంటి హీరోయిన్స్ సినిమాల్లో హాట్ హాట్ గా కనిపిస్తుండడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని రిప్లై ఇచ్చాడు.దీనితో ఇలాంటి మైండ్ సెట్ తో మాట్లాడిన అతనికి నిధి కూడా దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది.”ఇతని ఆలోచనా విధానం తనకి భయం కలిగిస్తుందని మీ చిరునామా ఇచ్చినట్టయితే “పింక్” అనే సినిమాను పంపిస్తానని,నీకు అది అవసరం”అని రిప్లై ఇచ్చారు.దీనితో కింద కామెంట్స్ లో ఆ రిప్లై ఇచ్చిన వాడికే మిగతా వారు నిధి బాగా గడ్డి పెట్టిందని ఇలాంటి ఆలోచనలే మానుకోవాలని విమర్శలు గుప్పిస్తున్నారు.