ప్రియాంక రెడ్డి కేసు లో నిజాలు బైటపెట్టిన నిందితులు

SMTV Desk 2019-11-30 16:33:01  

వెటర్నరి డాక్టర్ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసును చేధించిన పోలీసులు నింధితులను అరెస్ట్ చేసి మీడియాముందు ప్రవేశపెట్టారు. నింధితుల నుంచి అసలు నిజాలను రాబట్టిన పోలీసులకు ఒళ్ళు గగుర్పుడిచే విషయాలు తెలిశాయి. అయితే అనుకున్నట్టుగానే ప్రియాంక స్కూటీలో ముందుగానే గాలి తీసేశాశారని ఒప్పుకున్నారు. అయితే నిందితులలో ఒకరు ఆమె స్కూటీనీ పంక్షర్ చేయిస్తామని తీసుకెళ్లామని అప్పటికే ఆమె తన చెల్లెలికి ఫోన్ చేసి మాట్లాడిందని అన్నారు.

అయితే స్కూటీ పంక్చర్ చేయిస్తానని వెళ్ళిన నిందితుడి కోసం ఆమె వేచి చూస్తుండగా మిగతా ముగ్గురు నిందితులు కలిసి ఆమెను నోరు మూసి బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి లాకెళ్ళినట్టు ఒప్పుకున్నారు. అయితే ఆ షాక్ నుంచి తేరుకుని హెల్ఫ్ హెల్ఫ్ అని చాలా సార్లు అరిచిందని, లారీల అరుపులకు ఆ శబ్ధాలు ఎవరికి వినిపించలేదని చెప్పారు. అయితే కొద్ది సేపటికే స్కూటీ తీసుకెళ్లిన నిందితుడు కూడా ఆ ముగ్గురితో కలవడంతో వారి పని మరింత సులువయ్యిందని, ఆమె అరవకుండా ఉండేందుకు ఆమె నోట్లో మద్యం కూడా పోసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. దాదాపు 45 నిమిషాలపాటు ఆమెను చిత్రహింసలకు గురిచేసి రేప్ చేసిన నిందితులు ఆ తరువాత నోరు, ముక్కు మూసి చంపేశారు. అయితే మృతదేహాన్ని లారీలో తరలిస్తూ కూడా పలుసార్లు ప్రియాంక డెడ్ బాడీపై కూడా అత్యాచారానికి పాల్పడినట్టు నిందితులు ఒప్పుకున్నట్టు పోలీసులు వెల్లడించారు