“మంచి సీఎం కాదు ముంచే సీఎం”

SMTV Desk 2019-11-30 16:31:27  

ఏపీలో వైసీపీ అధికారాన్ని చేపట్టి ఆరు నెలలు గడిచిపోయింది. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజున ఆరు నెలలలోనే మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని చెప్పాడు. అయితే ఆరు నెలలలో జగన్ పాలనపై ప్రజలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పాలన గురుంచి కొందరు పర్వాలేదని అంటుంటే, మరికొందరు మాత్రం జగన్ అనాలోచిత నిర్ణయాల వలన ఏపీ అభివృద్ధిలో వెనకబడుతుందని ఆరోపిస్తున్నారు.

అయితే తాజాగా జగన్ ఆరు నెలల పాలనపై టీడీపీ ఒక బుక్‌ను రిలీజ్ చేసింది. “మంచి సీఎం కాదు ముంచే సీఎం” అనే టైటిల్‌తో ఉన్న బుక్‌ను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రిలీజ్ చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల ముందుకు వచ్చిన జగన్ ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రజలనే మోశం చేశారని యనమల అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రతిపక్షాలను టార్గెట్ చేశారని, ఆరు నెలలలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యిందని మండిపడ్డారు. జగన్ చెప్పిన పథకాలు ప్రకటనలకు తప్ప అమలుకు మాత్రం నోచుకోవడం లేదని అన్నారు.