చంద్రబాబు రాజధానిలో పర్యటించాల్సిన అవసరం ఏముంది..?

SMTV Desk 2019-11-29 17:24:25  

చంద్రబాబు రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు రాజధానిలో పర్యటించాల్సిన అవసరం ఏముంది..?అని అయన ప్రశ్నించారు. ఐదేళ్లు రాజధానిలో వందల కోట్లు అవినీతి చేశారు..పెద్ద స్కాం గా మార్చేశారు..గ్రాఫిక్స్, దుబారా ఖర్చులతో ప్రజాధనం వృధా చేశారు..అని మంది పడ్డారు. త్వరలోనే అమరావతిలో చేసిన స్కాంలు అన్ని ప్రజలకి తెలుస్తాయని అంబటి అన్నారు. రైతులను మోసం చేశారు కనుకే గత ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో కూడా తుక్కు తుక్కుగా ఓడించారని ఆ కడుపు మంటతోనే మీపై చెప్పులు, రాళ్లు వేశారని అన్నారు.

చంద్రబాబు సాష్టాంగ నమస్కారాలు చేసినా ప్రజలు నమ్మరు. అమరావతిపై అంత ప్రేమ ఉంటే సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదు..? ఇల్లు కూడా కట్టుకోడానికి ఇష్టపడని వ్యక్తి రాజధాని నిర్మాణం అంటూ ప్రచారం చేసాడు..సొంత ఇల్లు కట్టుకోకుండా అమరావతి గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి లేదు.. ముందు ఇల్లు కట్టుకో.. తరవాత అమరావతి గురించి మాట్లాడు..అని తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ కి ముందు ముందు ముసళ్ళ పండగ ఉందని అంబటి ఎద్దేవా చేసారు. అన్ని విచారణ జరుగుతుంది తొందరలో అన్ని బయటకి వస్తాయని అన్నారు. కేంద్రానికి పిర్యాదు చెయ్యడానికి పార్టనర్ ని పంపించాడు.. మళ్ళీ ఈయన వెళ్లి ఎమ్ చేస్తాడు..? ఏ రాజకీయ పార్టీ అయినా చంద్రబాబుని నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే..అని అంబటి అన్నారు. ఇక జగన్ కూడా త పాదయాతర్లో ప్రజలను ముద్దాడుతూ బాగానే నటించాడని, ప్రజలను మోసం చేయడానికి నక్కవినయాలు చూపించాడని, జగన్ నాటకాన్ని నమ్మిన ప్రజలు బాబు నిజాయితీని కూడా తప్పక నమ్ముతారని తెలుగుదేశం శ్రేణులు అంటున్నారు.