యువకుడి వేధింపులు తట్టుకోలేక...హైదరాబాద్‌లో యువతి అదృశ్యం

SMTV Desk 2019-11-29 17:22:02  

యువకుడి వేధింపులు తట్టుకోలేక.. ఆత్మహత్య చేసుకుంటానంటూ లెటర్‌ రాసి అదృశ్యమైందో యువతి. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. మౌనిక అనే యువతీ హిమాయత్‌నగర్‌లోని ఒక హాస్టల్‌లో ఉండి డిగ్రీ చదువుకుంటోంది . . సొంతూరు నిజామాబాద్‌ జిల్లా. కేశవ్‌ మెమోరియల్‌ కాలేజీలో డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. నిజామాబాద్‌ జిల్లాకే చెందిన సాయన్న అనే యువకుడు వేధిస్తున్నాడంటూ లేఖలో పేర్కొంది మౌనిక. ట్యాంక్‌బండ్‌లో దూకి చనిపోతున్నానని, శవాన్ని తీసుకెళ్లు నాన్నా..అంటూ రాసింది. కేసు నమోదు చేసి యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు నారాయణగూడ పోలీసులు. మరోవైపు యువతిని వేధిస్తున్న సాయన్న కోసం పోలీసులు గాలిస్తున్నారు.