కేసీఆర్ ను ఆకాశానికి ఏతేస్తున్న ఆర్టీసీ కార్మికులు

SMTV Desk 2019-11-29 16:23:06  

బస్సులు లేక ప్రజలు పడ్డ కష్టానికి తెర పడింది. 55 రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న డిపోల్లో సందడి వాతావరణం నెలకొంది. కేసీఆర్ మళ్లీ కార్మికులంతా విధుల్లోకి చేరండి అని పిలుపు నివ్వడంతో కార్మికులంతా ఆనందం లో తేలిపోతున్నారు. ఆర్టీసీ కి రూ. 100 కోట్ల సాయం అందజెయ్యడం..సమ్మె నేపథ్యంలో మరణించిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడం తో కార్మికులంతా కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.మరో వైపు కొన్ని చోట్ల కేసీఆర్ చిత్రపటానికి ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకాలు చేస్తున్నారు. పెద్దన్నలా తమను మళ్లీ విధుల్లోకి ఆహ్వానించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.నిజానికి రాష్ట్రంలో పేద మధ్య తరగతి ప్రజలే ఆర్టీసీ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు.
దాదాపు రెండు నెలల పాటు ఆర్టీసీ బస్సులు తిరగకపోవటంతో సామాన్యుల జేబులకు చిల్లు పడింది. ప్రైవేటు క్యాబులు, ఆటోల్లో ప్రయాణించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా సంపాదనలో ఎక్కువ భాగం రవాణా ఖర్చులకే పోయింది. ఇక ఇవాళ తెల్లవారుజాము నుంచే డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు డ్రైవర్లు కండక్టర్లు డిపోల ముందు క్యూ కడుతున్నారు. తమ డిపోలకు చేరుకొని విధుల్లో చేరుతున్నారు. ఇదిలా ఉంటే ఆర్టీసీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు.ఎలాంటి షరతులు లేకుండా డ్యూటీలో జాయిన్ అవుతామని తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచే కాకుండా ఆర్టీసీ JAC కూడా వారిని అదుకుంటుందని చెప్పారు.