'ఇండియా కరప్షన్ సర్వే2019'...తెలుగు రాష్ట్రాల స్థానాలు ఎంతో తెలుసా..

SMTV Desk 2019-11-29 16:22:26  

దేశం లోనే అత్యంత అవినీతి జరిగిన రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఇండియా కరప్షన్ సర్వే2019 . అత్యంత అవినీతి చోటుచేసుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ జాబితాలో 13వ స్థానంలో నిలిచి కొంత బెటర్ అనిపించుకుంది. ట్రాన్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ నిర్వహించిన ఇండియా కరప్షన్ సర్వే2019 లో ఈ నిజాలు బయటకు వచ్చాయి. మొత్తం 21 రాష్ట్రాల్లో ఈ సర్వేను ట్రాన్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహించింది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే. ఆస్తుల రిజిస్ట్రేషన్, భూ వివాదాల అంశాల్లో ఎక్కువ అవినీతి చోటుచేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని తేలింది. తమ పనులు చేయించుకోవడానకి లంచాలను ఇచ్చినట్టు 67 శాతం మంది ప్రజలు తెలియజేశారు. పలుమార్లు లంచాలను ఇవ్వాల్సి వచ్చిందని 56 శాతం మంది తెలిపారు. 11 శాతం మంది మాత్రం ఎలాంటి లంచాలు ఇవ్వకుండానే తమ పనులు అయ్యాయని చెప్పారు.ఇక మరో వైపు దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా మొదటి స్థానంలో రాజస్థాన్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. అతి తక్కువ అవినీతి కలిగిన రాష్ట్రంగా కేరళ నిలిచింది. గోవా, ఒడిశాలు కూడా అవినీతికి అత్యంత దూరంగా ఉన్న రాష్ట్రాలుగా నిలిచాయి.