లా విద్యార్థినిపై 12 మంది సామూహిక అత్యాచారం

SMTV Desk 2019-11-29 16:21:57  

రాంచీ: లా విద్యార్థినిపై 12 మంది సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఝార్ఖండ్‌లోని కంకే ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నవంబర్ 26వ తేదీన లా చదువుతున్న 25 ఏళ్ల యువతి తన స్నేహితుడితో కలిసి వెళ్తోంది. 12 మంది యువకులు యువతిని గన్‌తో బెదరించారు. అనంతరం ఇటుక బట్టీలోకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. లా విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సునీల్ ముండా, అజయ్ ముండా, కుల్దీప్ ఓరాన్, సునీల్ ఓరాన్, రాజన్ ఓరాన్, నవీన్ ఓరాన్, అమన్ ఓరాన్, రవి ఓరాన్, రోహిత్ ఓరాన్, రిషి ఓరాన్‌, బసంత్ కచ్ఛప్, సందీప్ టిర్కేగా పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి కారు, బైక్, రెండు అశ్లీల పుస్తకాలు, తుపాకీ, మూడు బులెల్లు, ఎనిమిది ఫోన్లను తాము స్వాధీనం చేసుకున్నామని ఎస్‌పి తెలిపాడు.