పవన్ ను కలిసిన

SMTV Desk 2019-11-25 11:59:25  

గతకొంత కాలంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "పింక్" మూవీ రీమేక్‌లో పవన్ నటించబోతోన్నాడని టాక్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్, వేణు శ్రీరామ్ వంటి వారి దర్శకత్వంలో సినిమాలు చేయబోతోన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరో మెగా దర్శకుడు పవన్ కళ్యాణ్‌ను కలిసినట్లు తెలుస్తుంది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో "ధ్రువ" సినిమా చేసిన సురేందర్ రెడ్ది ఇటీవల మెగాస్టార్ తో "సైరా నరసింహా రెడ్డి" సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యం లో సురేందర్ రెడ్డి పవన్ ను కలవడం ఆసక్తి కరంగా మారింది. సురేందర్ రెడ్డి తో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడా..? అన్న సందేహం అభిమానుల్లో మొదలైంది. ఇప్పటికే దర్శకుడు క్రిష్ పవన్ తో సినిమా చెయ్యాలని చూస్తున్నాడు. అది పింక్ రీమేకా లేక మరో ప్రాజెక్టా అన్న విషయం ఇంత వరకు తెలియలేదు. అలాగే ఆ మధ్య తమిళ దర్శకుడు హరి కూడా పవన్ తో భేటీ అయ్యాడు. హరి తో పవన్ సినిమా చేస్తున్నాడని అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ దాని పై కూడా క్లారిటీ రాలేదు. ఇక ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి పవన్ ను కలవడం పవన్ అభిమానుల్లో ఉత్కంఠను పెంచేసింది.

సైరా సక్సెస్ తర్వాత సురేందర్ రెడ్డి తో సినిమా చేయాలన్న ఆసక్తిని పవన్ వ్యక్తపరిచినట్లు టాక్. పవన్ నటిస్తాను అంటే తమ సొంత బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్స్ లోనే సినిమా తెరకెక్కించేందుకు ఆసక్తిగా ఉన్నామని చరణ్, చిరులు ఇంతకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సూరీ-పవన్ మీటింగ్‌తో.. వీరి కాంబినేషన్‌లో కొణిదెల ప్రొడక్షన్స్‌లో సినిమా రాబోతోందనే వార్తలు ఊపందుకుంటున్నాయి.మరి పవన్ సురేందర్ రెడ్డి తో సినిమా చేస్తున్నాడా లేదా అన్నది తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటన వచ్చే ఎదురుచూడాల్సిందే.