వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్ డేట్ ?

SMTV Desk 2019-11-20 12:55:21  

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ యాక్ట్రెస్ ఐశ్వర్యా రాజేష్, రాశి ఖన్నా, కేథరిన్ త్రెసాలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టైటిల్ పోస్టర్ తో మొన్నామధ్య సర్ ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది చెప్పలేదు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా సినిమాలో విజయ్ లవ్ ఫెయిల్యూర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ ఇయర్ వచ్చిన డియర్ కామ్రేడ్ ఆశించిన స్థాయిని అందుకోలేదు. మరి వరల్డ్ ఫేమస్ లవర్ అయినా రౌడీ హీరోకి హిట్ ఇస్తుందేమో చూడాలి. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ డైరక్షన్ లో విజయ్ సినిమా చేస్తున్నాడు.