పవన్ కల్యాణ్ చేయాల్సిన సినిమా.... నేను చేశా!!

SMTV Desk 2019-11-19 11:57:17  

ఈ నెల 22న రిలీజవుతుంది ‘జార్జిరెడ్డి’ సినిమా. సందీప్ మాధవ్ ఈ సినిమాలో ‘జార్జిరెడ్డి’గా నటించారు. 1968– 70 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ బయోపిక్‌లో జార్జిరెడ్డి లైఫ్‌లోని కొన్ని కీలక అంశాలను తెరకెక్కించారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందీప్ మాధవ్ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘జార్జిరెడ్డి ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అదే స్థాయిలో రీచ్ అవుతుందనే నమ్మకంతో చాలా కష్టపడ్డాం. ట్రైలర్‌లో చూసి అది అందరూ ఉస్మానియా యూనివర్సిటీలో షూట్ చేశాం అనుకుంటున్నారు. నిజానికి అది సెట్ వేశాం. 1960‌లో యూనివర్సిటీ ఎలా ఉండేదో దాన్ని బట్టి సెట్ వేశారు.
ఈ సినిమా వల్ల రెండేళ్ళ గ్యాప్ వచ్చింది. చాలా సినిమాలు వదులుకున్నాను ఈ సినిమా చేసే ప్రాసెస్‌లో. ఈ సినిమా ఉండి ఉండకపోతే వాటిలో ఏవో కొన్ని చేసేసేవాడిని. కానీ ఈ కథ ముందు ఏదీ గొప్పగా అనిపించలేదు. నిజానికి జార్జిరెడ్డి అంటే పవన్ కళ్యాణ్‌గారికి చాలా ఇష్టం. ఈ సినిమా ఆయన చేయాలనుకున్నారట. అందుకే ఓ సాంగ్ ఆయనకి డెడికేట్ చేశాం.

బుల్లెట్ బైక్ సాంగ్‌కి ట్రైలర్‌కి వచ్చిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దానికి రీజన్.. ఈ సినిమాలో ఇలాంటి సాంగ్ ఏంటి..? అనుకోవడమే. ఈ సాంగ్‌ని సెపరేట్‌గా చూస్తే అలా అనిపిస్తుంది కానీ.. సినిమా చూస్తే ఖచ్చితంగా కనెక్టివిటీ ఉందనిపిస్తుంది. అలాగే సినిమా చూశాక ‘ఇంత గొప్ప మనిషిని మనం పోగొట్టుకున్నామా…?’ అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అందరికీ కలుగుతుంది. ‘ఇస్రో..’ లాంటి సంస్థలో అవకాశం వచ్చినా వదులుకున్నారాయన. ఇలాంటి హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ సినిమాలో చాలా ఉంటాయి..’’ అని తెలిపారు.