పెరిగిన పెట్రోల్ ధర!!

SMTV Desk 2019-11-19 11:53:39  

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధికమవడంతో వరుసగా ఆరో రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. అలాగే, ఈ రోజు డీజిల్ ధరలూ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల్లో లీటరు పెట్రోల్ ధర 15 పైసలు పెరగగా, చెన్నైలో 16 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 78.96, డీజిల్‌ ధర 71.85 గా ఉంది.

విజయవాడలో పెట్రోలు ధర రూ.78.17, డీజిల్‌ ధర 70.81గా ఉంది. ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 74.20, డీజిల్‌ ధర 65.84, కోలకతాలో పెట్రోలు ధర రూ. 76.89, డీజిల్‌ ధర 68.25, చెన్నైలో పెట్రోలు ధర రూ. 77.13 డీజిల్‌ ధర 69.59, ముంబయిలో పెట్రోలు ధర రూ. 79.86, డీజిల్‌ ధర 69.06గా ఉన్నాయి.