'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' నుంచి మరో పోస్టర్

SMTV Desk 2019-11-19 11:51:43  

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలోంచి మరో పోస్టర్ ను విడుదల చేశారు. అలాగే, రేపు ఉదయం 9.36 గంటలకు ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్- 2 విడుదల చేస్తానని ప్రకటించారు. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆటో నడుపుతున్నట్లు ఉండడం గమనార్హం.

సినిమా టైటిల్ తోనే వేడి పుట్టించిన రామ్ గోపాల్ వర్మ... ఈ చిత్రంలోంచి పోస్టర్లను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే చంద్రబాబు, నారా లోకేశ్ తో దేవాన్ష్ ఆడుకుంటున్నట్లు ఉన్న పోస్టర్ ను బాలల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి మొదటి ట్రైలర్‌ ను ఇప్పటికే విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలువురు నేతలను ఉద్దేశించి ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది.