అసురన్ రీమేక్ ఆ డైరక్టర్ ఫిక్స్

SMTV Desk 2019-11-19 11:50:20  

తమిళంలో సూపర్ హిట్టైన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు నిర్మాత సురేష్ బాబు. విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా దర్శకుడి విషయంలో రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. హను రాఘవపుడి, అజయ్ భూపతి, వెంకటేష్ మహా.. ఈ ముగ్గురిలో ఒకరు ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తారని అనుకున్నారు. కాని ఆ ఛాన్స్ శ్రీకాంత్ అడ్డాలకు వెళ్లిందని లేటెస్ట్ న్యూస్.

సురేష్ బాబు కూడా అసురన్ రీమేక్ శ్రీంకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తారని చూచాయగా చెప్పేశారు. వెంకటేష్, మహేష్ లతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసిన శ్రీంకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం తర్వాత కనిపించకుండా పోయాడు. ఈమధ్య గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ శ్రీకాంత్ అడ్డాలతో ఓ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని అన్నారు కాని ఇప్పటివరకు అయితే ఎలాంటి ఎనౌన్స్ మెంట్ రాలేదు. అసురన్ రీమేక్ ను శ్రీకాంత్ అడ్డాల చేతుల్లో పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాతో శ్రీకాంత్ మళ్లీ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాడేమో చూడాలి.