వ్యక్తిగత విమర్శలు చేసి సమస్యలని పక్కదారి పట్టిస్తున్న నాయకులు ....

SMTV Desk 2019-11-12 14:36:15  

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు రాష్ట్ర ప్రజలను ఆకర్షించడంలో జగన్ సఫలమయ్యారు. అయితే ఇసుక కొరత విషయం లో మాత్రం జగన్ పై వ్యతిరేకత ఏర్పడింది. కార్మికులు బలవన్మరణాలకు పాల్పడటం, పనుల్లేక పట్టణాలకు తరలి వెళ్లడం, ఆహారం కూడా లభించని స్థితిలో వున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ఇసుక కొరత పై చేస్తున్న పోరాటాన్ని మళ్లించేందుకే పవన్ పై విమర్శలు చేసారు జగన్ మోహన్ రెడ్డి అని జనసైనికులు ఆరోపిస్తున్నారు. సంయమనం పాటించండి అంటూ జనసైనికులకు హితవు పలికారు జనసేన నాయకులు. అయితే ఇసుక కొరత విషయం లో చంద్రబాబు, నారా లోకేష్ లు నిరసన తెలుపుతూ, ధర్నాలు నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. అయితే ఈ విషయం లో చంద్రబాబు చాల సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ పై, చంద్రబాబు పై సంచలన ఆరోపణలు చేస్తూ సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇసుక కొరత పై మాత్రమే కాకుండా జగన్ ప్రవేశ పెట్టిన ఆంగ్ల మాధ్యమం గురించి కూడా పలువురు నేతల విమర్శలు ఎదురుకుంటున్నారు జగన్. అయితే వైసీపీ నేతలు మాత్రం సమస్యల పై గళమెత్తే వారి పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ సమస్యలని పక్కదారి మళ్లిస్తున్నారని పలువురు భావిస్తున్నారు.