సుప్రీం కోర్టు తీర్పు పై ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు

SMTV Desk 2019-11-09 16:38:56  

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు అంతిమ తీర్పు నేపథ్యంలో తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు తన సుప్రసిద్ధ "జస్ట్ ఆస్కింగ్" హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి ట్వీట్ చేశారు. "అయోధ్యలో మందిరం నిర్మిస్తారు, మసీదు కూడా కట్టొచ్చు గాక! కానీ ఇప్పటికే ఎంతో రక్తపాతం జరిగింది. మనిషి ప్రాణం ఎంతో విలువైంది. తదనంతరం జరగబోయే హింసను, రెచ్చగొట్టే ధోరణులను మనం ఆపలేమా! మనిషి ప్రాణాలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టలేమా! దయచేసి ఆలోచించండి!" అంటూ ఉద్వేగభరితంగా స్పందించారు.