సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అవుతున్న ప్రియాంక

SMTV Desk 2019-11-04 17:16:04  

దిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. షూటింగ్స్ కోసం వెళుతున్న సెలబ్రిటీలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన తర్వాతి ప్రాజెక్ట్ షూటింగ్ కోసం దిల్లీ వెళ్లింది. అక్కడి కాలుష్యం భరించలేక ఎయిర్ ప్యూరిఫైయర్ మాస్క్ వేసుకుని సెల్ఫీ దిగింది. ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘షూటింగ్ కోసం దిల్లీ వచ్చాను. ఇక్కడ షూటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలా జీవిస్తున్నారో ఊహించడం కూడా కష్టంగానే ఉంది. మనకు ఎయిర్ ప్యూరిఫైయర్స్, మాస్క్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇళ్లు లేనివారిని ఆ దేవుడే కాపాడాలి’ అని క్యాప్షన్ పెట్టారు. అయితే ముందుగా ఊహించినట్లుగానే ప్రియాంక పోస్ట్‌‌పై ట్రోలింగ్ మొదలైంది. ఎందుకంటే ప్రియాంకకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందని ఆమె ఓ సందర్భంలో చెప్పింది. అయితే బీచ్‌లో తన భర్త నిక్ జొనాస్‌తో కలిసి సిగరెట్ తాగుతూ కనిపించింది. దాంతో ‘ఇప్పుడు ఈ ఆస్తమా డ్రామా ఏమైంది?’ అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. ఇప్పుడేమో దిల్లీలో కాలుష్యం ఉందంటూ ఫొటో పెట్టడంతో మళ్లీ ట్రోలింగ్ మొదలైంది.