ఒకరికే రెండు అకౌంట్లు ఉంటే!... ఖాతాలను క్లోజ్ చేసుకుంటేనే మంచిది!

SMTV Desk 2019-10-31 16:05:32  

ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగిన వారికి చార్జీలు ఎక్కువగా పడతాయి. బ్యాంక్ ఖాతాదారులు వారి అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. లేదంటే పెనాల్టీలు పడతాయి. ఒకరికే రెండు అకౌంట్లు ఉంటే.. వాటిల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే అప్పుడు డబుల్ పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని అకౌంట్లను క్లోజ్ చేసుకోవడం మంచిది. బ్యాంక్ అకౌంట్‌ను క్లోజ్ చేయాలని భావిస్తే.. కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. అవేంటో చూద్దాం..
✺ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయడానికి ముందుగానే ఆటోమేటెడ్ డెబిట్స్‌ను నిలిపి వేసుకోవాలి. లేదంటే ప్రాబ్లమ్ అవుతుంది. మంత్లీ ఈఎంఐ లోన్, సిస్టమ్యాటిక్ ఇన్వె్స్ట్‌మెంట్ ప్లాన్ (సిప్), రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ అకౌంట్), డిపాజిట్లు వంటి వాటికి కొత్త ప్రత్యామ్నాయ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అకౌంట్ క్లోజ్ చేసే సమయంలో డీ-లింకింగ్ అకౌంట్ ఫామ్‌‌ను ఫిల్ చేసేటప్పుడు ఈ వివరాలు అందించాలి. దీనికి దాదాపు 10 రోజులు పట్టొచ్చు. తర్వాత బ్యాంక్ అకౌంట్ క్లో్జ్ అవుతుంది.
✺ అకౌంట్ క్లోజర్ ఫామ్ తీసుకొని.. మీరు ఎందుకని అకౌంట్‌ను క్లోజ్ చేసుకుంటున్నారో కారణం తెలియజేయాలి. అలాగే అకౌంట్‌లోని డబ్బులను ఏ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో కూడా బ్యాంక్ అధికారులకు వేరొక ఫామ్ ద్వారా తెలపాలి. లేదంటే మీ డబ్బులు మీకు రావు.
✺ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ సమయంలో చెక్ బుక్స్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, పాస్‌బుక్స్ వంటి వాటిని తిరిగా అప్పగించాల్సి ఉంటుంది. అందుకే వీటిని మీ వద్దనే ఉండేలా చూసుకోండి.
✺ అకౌంట్‌ను ప్రారంభించిన 14 రోజులలోపు అకౌంట్ వద్దనుకుంటే.. అప్పుడు ఎలాంటి చార్జీలు పడకుండానే ఖాతాను క్లోజ్ చేయవచ్చు. అయితే అటుపైన బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే చార్జీలు పడతాయి. ఏడాది తర్వాత అకౌంట్ చేసినా కూడా ఎలాంటి చార్జీలు ఉండవు. అంటే 14 రోజుల తర్వాత నుంచి ఏడాది లోపు అకౌంట్ క్లోజ్ చేస్తే రూ.500తోపాటు జీఎస్‌టీ కట్టాల్సి వస్తుంది. అందుకే ఏడాది తర్వాత అకౌంట్ క్లోజ్ చేసుకోవడానికి ప్రాధాన్యమివ్వండి. చార్జీలు తప్పించుకోండి.
✺ ఒకవేళ మీరు పెన్షన్ వంటి వాటిని పొందుతూ ఉంటే అప్పుడు కొత్త అకౌంట్ నెంబర్‌ను మీ సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. లేదంటే పెన్షన్ డబ్బులు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.