చంద్రబాబు పరువు తీస్తున్న వైసీపీ నేత

SMTV Desk 2019-10-30 15:30:30  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయాలు మారిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం హయం లో చేసిన ఒక్కొక్క పనిని వైసీపీ ప్రభుత్వ నేతలు తప్పుబడుతున్నారు. చంద్రబాబు పై విమర్శలు చేసేందుకు ఏ కారణం దొరికిన వొదలడం లేదు. చంద్రబాబు గతంలో రాష్ట్రాన్ని ఆర్థిక మాంద్యం దెబ్బ తినకుండా కాపాడేందుకు చాలా ప్రయత్నాలే చేసారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ కు చాల గట్టి దెబ్బె పడింది. అభివృద్ధి పరచడానికి తగు సౌకర్యాలుఅంతంత మాత్రమే, తాను కస్టపడి చేసిన ఎన్నో ఎంఓయూ లు చెదలు పట్టాయి. అదే విషయాన్నీ విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

డ్వాక్రా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు 16 కంపెనీలతో చంద్రబాబు 2015 నవంబర్ లో ఎంఓయూ కుదుర్చున్న విషయాన్నీ తెలియజేసారు. పలు దిగ్గజ కంపెనీలను పిలిపించి సినిమా చూపించారని ఎద్దేవా చేసారు. ఒప్పంద పత్రాలు చెదలు పట్టాయి కానీ, కొనుగోళ్లు జరగలేదని విమర్శించారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది మీరు ఆ చెదలు దులపండి అంటూ నెటిజన్లు వైసీపీ కి రివర్స్ లో పంచులు వేస్తున్నారు. రాష్ట్రానికి ఎంతో మూలం అయిన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.