దమ్ముంటే ఇసుక కొరత లేదని ప్రజల్లోకి వెళ్లి చెప్పండి

SMTV Desk 2019-10-30 15:25:59  

వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఉండి ఇసుక కొరత లేదని చెప్పడం పట్ల టీడీపీ నేత బుద్ధా వెంకన్న దారుణ విమర్శలు చేసారు. ఇసుక కొరత తో ఒక పక్క భవన నిర్మాణ కార్మికులు, ప్రజలు, చిన్న తరహా వ్యాపారాలు కష్టాలు పడుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ విషయాల్ని ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు బుద్ధా వెంకన్న. కార్మికులని మింగేస్తున్న మీరు ఇసుక కొరత గురించి మాట్లాడుతున్నారా విజయసాయిరెడ్డి గారు? అని అంటూనే పిల్లి పాలు త్రాగుతూ ఎవరూ చూడట్లేదు అన్నట్లుగా వుంది మీ వ్యవహారం. దమ్ముంటే ఇసుక కొరత లేదని ప్రజల్లోకి వెళ్లి చెప్పండి అని అన్నారు.

అయితే విజయసాయిరెడ్డి ఇసుక కొరత లేదు అన్నట్లుగా మాట్లాడిన విధానాన్ని విమర్శిస్తూ బుద్ధా వెంకన్న మరో విషయాన్నీ ప్రస్తావించారు. ఇసుక కొరత లేకపోతె మీ మేధావి ఇసుక వారోత్సవాలు ఎందుకు చేస్తున్నట్లు అంటూ జగన్ ని టార్గెట్ చేసారు. అంతే కాకుండా వైకాపా నేతల అరాచకాల్ని కూడా తెలియజేసారు. వైసీపీ ఇసుక మాఫియా ఎలా ఉందంటే ట్రాక్టర్ డ్రైవర్ల పై దాడులు చేసి, అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడటం లేదని అన్నారు.