రుద్రమదేవి నేను చేయాల్సిన సినిమా!

SMTV Desk 2019-10-30 15:22:47  

లేడీ డాన్ విజయశాంతి సుదీర్ఘ విరామం తర్వాత మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అనీల్‌ రావిపూడి ఈమెను ఒప్పించి, మెప్పించి ఈ సినిమాలో నటింపజేస్తున్నాడు.ఈ చిత్రంకు ఆమె భారీ పారితోషికం తీసుకుంటున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.ఇటీవలే విజయశాంతి ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.కొన్ని సంవత్సరాల క్రితం రాణి రుద్రమదేవి చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది.విజయశాంతి అండ్‌ టీం రాణి రుద్రమ చిత్రం కోసం చాలా రీసెర్చ్‌ కూడా చేస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది.ఆ విషయం గురించి ఇప్పుడు మీడియాతో మాట్లాడిన విజయశాంతి క్లారిటీ ఇచ్చింది. రాణి రుద్రమ సినిమా తీయాలని సొంత బ్యానర్‌లో టైటిల్‌ కూడా రిజిస్ట్రర్‌ చేయించాను.సొంతంగా నిర్మించేందుకు చాలా ప్రయత్నాలు చేశాను.కథను సిద్దం చేయించి అంతా ఓకే అనుకుని సెట్స్‌ పైకి వెళ్లాలనుకున్న సమయంలో రాజకీయంగా చాలా బిజీగా ఉండటం, ఆ సమయంలో ఉద్యమం ఉదృతంగా సాగుతున్న కారణంగా ఇప్పుడు సినిమాలు చేయడం కరెక్ట్‌ కాదేమో అనిపించింది.అందుకే ఆ సినిమాను పక్కకు పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది.ఒక గొప్ప పోరాట యోధురాలి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీయాలనుకున్నట్లుగా చెప్పింది.రాములమ్మ అండ్‌ టీం తీయలేక పోయిన రుద్రమ సినిమాను అనుష్కతో గుణశేఖర్‌ తీసిన విషయం తెల్సిందే.