ఆర్టీసీ కార్మికుల సకల జనుల సభ జరిగేనా?

SMTV Desk 2019-10-29 17:08:56  

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె జరగబట్టి 25 రోజులవుతున్న ప్రభుత్వం తీరు మారలేదు. ఎంత పోరాటం చేసిన ఎదో ఒక విషయం లో అడ్డంకి తప్పడం లేదు. అయితే సరూర్ నగర్ లో 30 వ తారీఖు న ఆర్టీసీ కార్మికులు, సంఘం, సకల జనుల సభను నిర్వహించాలని ముందే ప్లాన్ వేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే సభకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అనుమతిని ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే ఆర్టీసీ ఐకాస నేతలు హైకోర్టు ని ఆశ్రయించారు.

కోర్టు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారని సమాచారం. ఇప్పటివరకు వీరు చేస్తున్న సమ్మెలో ఇప్పటికే చాల మంది కార్మికులు ఆత్మాహత్య లు చేసుకున్నారు. హైకోర్టు కూడా నిన్న పలు అంశాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే అంశం మినహా మిగతా అంశాలను, డిమాండ్లని చర్చిస్తే బావుంటుందని అభిప్రాయం పడింది. అయితే సకల జనుల సభ తో ఆర్టీసీ తన బలాన్ని, వారి మద్దతు ని ప్రభుత్వానికి చూపించాలని అనుకుంటుంది. మరి ఈ సభకి అనుమతి వస్తుందో రాదో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాలి.