ఆ ప్రదేశంలో సీక్రెట్ కెమరా పెట్టుకొని వీధుల్లో చక్కర్లు కొట్టిన మహిళ...అందరి చూపు అక్కడే!

SMTV Desk 2019-10-28 15:16:55  

ఓ మహిళకు ఓ ఆలోచన తట్టింది. సాధారణంగా మహిళ రోడ్డు మీద సంచరించేప్పుడు అందరి చూపు ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలని అనుకోని తన ‘బ్రా’కు ఓ హిడెన్ కెమేరా పెట్టుకుని రోడ్డు మీదకు వచ్చింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి వీడియోను చూసి షాకైంది. కేవలం మగాళ్లు మాత్రమే మహిళల ఎద (రొమ్ములు) సంపద చూస్తారని భావించిన ఆమెకు కొత్త విషయం తెలిసింది. మహిళలు, చివరికి కుక్కలు కూడా ఆమె ఎదను చూడటం చూసి ఆశ్చర్యపోయింది. విట్నీ జెలిగ్ అనే 29 ఏళ్ల మహిళకు ఈ కొత్త ఆలోచన వచ్చింది. అయితే, ఆమె ఇలా చేయడం వెనుక అసలు కారణం వేరే ఉంది. ఒక మంచి విషయాన్ని మంచిగా చెబితే ప్రజల్లోకి వెళ్లదని భావించిన ఓ మహిళ ఈ మార్గాన్ని ఎంచుకుంది. పైగా, ఆమె అవగాహన కలిగించే విషయం కూడా ఎదకు సంబంధించినదే కావడంతో ఈ ప్రయత్నం చేసింది. ప్రపంచంలో అత్యధిక మహిళలను వేధిస్తున్న సమస్య రొమ్ము క్యాన్సర్ (బ్రెస్ట్ క్యాన్సర్). దీనిపై చాలా మందికి మహిళలకు అవగాహన ఉండకపోవడం వల్ల క్యాన్సర్ ముదిరే వరకు గుర్తించలేకపోతున్నారు. రొమ్ములో వచ్చే చిన్న చిన్న గడ్డలను నిర్లక్ష్యం చేయడంతో మొదలయ్యే సమస్య చివరికి ప్రాణాలు తీస్తోంది. ఈ నేపథ్యంలో విట్నీ.. తన ఎద సంపద స్వల్పంగా బయటకు కనిపించేలా బ్రాను ధరించింది. ఆ తర్వాత వీధుల్లో తిరుగుతూ.. అందరి ‘చూపు’లను రికార్డు చేసింది. ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో చివర్లో.. ‘‘మహిళలు, మీ సొంత రొమ్ములను కూడా చెక్ చేసుకోండి’’ అని సందేశం ఇచ్చింది. అంటే, ఇతరుల రొమ్ములనే కాకుండా.. మీ రొమ్ముల్లో ఏర్పడే సమస్యపై కూడా అవగాహన పెంచుకోండి అని చెప్పాలనేది ఆమె సందేశం.