సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.64,700 చొప్పున బోనస్

SMTV Desk 2019-10-24 15:47:17  

సింగరేణి కార్మికులకు ఓ శుభవార్త. సింగరేణి సంస్థ ఏటా దీపావళి పండుగ ముందు కార్మికులకు బోనస్ చెల్లిస్తుంటుంది. ఈసారి కూడా దీపావళికి రెండు రోజుల ముందు అంటే ఈనెల 25న బోనస్ చెల్లించబోతున్నట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. ఈ ఏడాది సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.64,700 చొప్పున బోనస్ అందుకోబోతున్నారు. సింగరేణిలో 48,000 మంది కార్మికులు బోనస్ అందుకోబోతున్నారు. దీనికోసం సింగరేణి సంస్థ రూ.280 కోట్లు కేటాయించింది.