“బిగిల్” చిత్రానికి షాకింగ్ రిజల్ట్

SMTV Desk 2019-10-24 15:44:50  

కోలీవుడ్ సెన్సేషనల్ హీరో దళపతి విజయ్ హీరోగా నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “బిగిల్”. ఇదే చిత్రాన్ని తెలుగులో “విజిల్” పేరిట విడుదల చేస్తున్నారు.విజయ్ మరియు అట్లీ కాంబినేషన్ అంటే కోలీవుడ్ లో రికార్డులు బద్దలు అవ్వాల్సిందే.ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు కోలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసాయి.

అలా ఇప్పుడు వస్తున్న “బిగిల్” పై కూడా భారీ అంచనాలు ఏర్పరచుకొని తెలుగులో కూడా గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం తాలూకా రివ్యూ ఇప్పుడు ట్విట్టర్ లో వచ్చేసింది.ఇండియన్ మార్కెట్ నుంచి విడుదల కాబడిన బిగ్గెస్ట్ సినిమాలకు ముందు గానే రివ్యూ ఇచ్చిన ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ శివ సత్యం స్పెషల్ షోస్ ద్వారా ముందే చూసేసి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వాటి తాలూకా ఫలితాలను చెప్తారు.

అయితే ఇప్పుడు “బిగిల్” చిత్రానికి షాకింగ్ రిజల్ట్ ఇచ్చారు.”వన్ వర్డ్ రివ్యూ అని పెట్టి సినిమా టార్చర్” అని షాకిచ్చి ఒక్క స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు.ఈ సినిమాకు మెయిన్ విలన్ స్క్రీన్ ప్లేనే అని మరో ముక్క హైలైట్ చేసారు.కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈయన గతంలో “వార్” చిత్రానికి కూడా ఇదే విధమైన రేటింగ్ ఇచ్చారు.కానీ అది అక్కడ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యిపోయింది.మరి ఇప్పుడు బిగిల్ కు కూడా ఇలాగే అంటున్నారు మరి ఈ లెక్కన…?