పెరుగుతున్న టీఆర్‌ఎస్‌ మెజారిటీ

SMTV Desk 2019-10-24 15:44:10  

తెలంగాణలోని ముందస్తు ఎన్నికలు జరిగిన తర్వాత మరోసారి అధికారం చేపట్టిన తెరాస పార్టీ మరోసారి జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేసే దిశగా కొనసాగుతుంది.టీకాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ ఎంపీగా ఎన్నికయ్యిన తర్వాత హుజూర్ నగర్ లో మళ్ళీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది.ఈసారి పోటీని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

అయితే ఇప్పుడున్న వ్యతిరేఖతను చూసి కారు జోరుకు బ్రేక్ పడుతుందని అంతా అనుకోగా వారికి షాకిచ్చే విధంగా అక్కడ కూడా కారు జోరు కొనసాగుతుంది.మొదటి రౌండ్ నుంచి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న తెరాస అభ్యర్థి సైదిరెడ్డి తొమ్మిదో రౌండ్ వచ్చేసరికి అక్కడ తమ ప్రత్యర్ధ పార్టీ అభ్యర్థి అయినటువంటి పద్మావతిపై 9 వ రౌండ్ పూర్తయ్యేసరికి 19 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ముందంజలో ఉన్నారు.మూడు మండలాల్లో ఇప్పటికే ఈ బైపోల్ లెక్కింపు కూడా పూర్తయ్యింది.ఈసారి కూడా కారు జోరు తగ్గేలా లేదని చెప్పాలి.

*వరుసగా తొమ్మిదో రౌండ్ లో కూడా ఆధిక్యతను కనబరుస్తున్న సైది రెడ్డి. తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేసరికి 16,495 ఓట్ల ఆధిక్యం. సైదిరెడ్డి కి ఇప్పటివరకూ 46,451 ఓట్లు పడగా, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి 30,600 ఓట్లు పడ్డాయి.

*ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ హవా కనిపిస్తుంది అనుకున్న నేరేడుచర్ల,పాలకవీడు,మఠంపల్లి మండలాల్లో కూడా కారు దూసుకుపోతుంది.

*పదో రౌండ్ లో కూడా తగ్గని కారు జోరు..మొత్తం 18,682 ఓట్ల ఆధిక్యంలో సైదిరెడ్డి ముందంజ.

*ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాల వలనే ఈస్థాయి జోరు – మంత్రి తలసాని శ్రీనివాస్

*అనుకున్న విధమైన ఫలితాలు వస్తుండడంతో సైదిరెడ్డి బృందం అప్పుడే సంబరాలు కూడా మొదలు పెట్టేసారు.