నువ్వా-నేనా...'మహా' ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్xబిజెపి!

SMTV Desk 2019-10-24 15:41:48  

మహారాష్ట్ర, హరియాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఇండియటుడే-యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్‌ మాత్రం హరియాణాలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా, నేనా అన్నట్టుగా ఉంటుందని తెలిపింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత, ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరిగిన అతిపెద్ద ఎన్నికలు కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకుంది. మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ అధికారంలో ఉండగా, తిరిగి తమదే విజయమని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. మహారాష్ట్రలో శివసేనతో జట్టుకట్టిన బీజేపీ 164 చోట్ల బరిలో నిలిచింది. మిత్రపక్షం శివసేన 124 స్థానాల్లోనూ పోటీ చేసింది. ఫలితాలు వెలువడక ముందే మహారాష్ట్రలో తమ మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. తమ పార్టీ 100 స్థానాల్లో విజయం సాధిస్తుందని రౌత్‌ ధీమా వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్‌లను ముందుగా లెక్కిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.పోస్టల్ బ్యాలెట్‌లో ఆధిక్యత చూపిన బీజేపీ-శివసేన కూటమి. మహారాష్ట్రలో 81 స్థానాల్లో బీజేపీ కూటమి, 43 స్థానాల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ఆధిక్యంలో ఉన్నాయి.

హరియాణాలో బీజేపీ 36, కాంగ్రెస్ 10, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోన్నారు.
తొలి రౌండ్ ముగిసేసరికి మహారాష్ట్రలో బీజేపీ కూటమి 119, కాంగ్రెస్ కూటమి 44 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి.
హరియాణాలో తొలి రౌండ్ ముగిసేసరికి బీజేపీ 40, కాంగ్రెస్ 29, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు.
హరియాణాలో కర్నాల్ స్థానంలో సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఆధిక్యతలో ఉండగా, మహారాష్ట్ర సీఎం దేవేందర్ ఫడణ్‌వీస్ నాగ్‌పూర్ సౌత్ స్థానంలో ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు.
మహారాష్ట్రలో ఇప్పటి వరకు 230 స్థానాల్లో తొలి రౌండ్ పూర్తవగా బీజేపీ-శివసేన కూటమి 164 స్థానాల్లోనూ, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 61 చోట్ల, ఇతరులు 10 చోట్ల ఆధిక్యతలో ఉన్నారు.
హరియాణాలోని బరోడా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రెజర్ల యోగేశ్వర్‌దత్ ఆధిక్యత.
హరియాణాలో పలువురు కేంద్ర మంత్రులు వెనుకంజ. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు.
మహారాష్ట్రలో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల సరళి ప్రకారం బీజేపీ కూటమి 171 స్థానాల్లోనూ, కాంగ్రెస్ కూటమి 72 స్థానాల్లోనూ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి.
హరియాణాలో మాత్రం ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. మొత్తం 90 స్థానాలున్న ఇక్కడ బీజేపీ 40, కాంగ్రెస్ 29, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక్కడ ఎంఐఎం పార్టీ మూడు చోట్ల ఆధిక్యత ప్రదర్శిస్తోంది. మొత్తం 59 స్థానాల్లో ఆ పార్టీ తన అభ్యర్థులను రంగంలోకి దింపగా, ఔరంగాబాద్ ప్రాంతంలో ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
బారామతిలో కాంగ్రెస్ నేత అజిత్ పొవార్ స్పష్టమైన మెజార్టీ దిశగా సాగుతున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి గోపీచంద్ పదాల్కర్‌పై 18,000కుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కొంకణ్‌ ప్రాంతంలో శివసేన, ముంబయి నగరం, మరఠ్వాడలో బీజేపీ-శివసేన కూటమి ముందంజలో ఉంది. అయితే ఉత్తర, పశ్చిమ మహారాష్ట్రలో ఎన్సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విదర్భలో మాత్రం కాషాయ పార్టీ దూసుకుపోతోంది.
90 స్థానాలున్న హరియాణాలో ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. ఇక్కడ బీజేపీ 38, కాంగ్రెస్ 30, జేపేపీ 10, ఇతరులు 12 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
ప్రభుత్వ ఏర్పాటులో జేజేపీ, ఇండిపెడెంట్లు కీలకంగా మారునుంటంతో బీజేపీ రంగంలోకి దిగింది. వారితో సంప్రదింపులు ప్రారంభించింది.
మహారాష్ట్రలోని మాలెగావ్ స్థానంలో ఎంఐంఎం అభ్యర్థి 6,000 ఓట్లకుపైగా ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
కర్నాల్ స్థానంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మూడో రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి తన సమీప ప్రత్యర్థిపై 14,030ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హరియాణా ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగడంతో మాజీ ఉప-ప్రధాని చౌదరి దేవీలాల్ మనవడు దుష్యంత్ సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీకి కీలకంగా మారింది.
జేజేపీకి కాంగ్రెస్ పార్టీ ఏకంగా సీఎం పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. ఇక్కడ కూడా గతంలో కర్ణాటక ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాన్ని కాంగ్రెస్ అనుసరిస్తోంది.
మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్ ఓట్లకు ఎంఐఎం భారీగా గండికొట్టింది. ఆ పార్టీ అభ్యర్థులు గణనీయంగా ఓట్లను దక్కించుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థులపై తీవ్ర ప్రభావం చూపింది.
తొలిసారి థాక్రే కుటుంబం ఎన్నికల బరిలో నిలవగా, వర్లీ నుంచి ఆదిత్య థాక్రే పోటీ చేశారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 11 వేల ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 96, శివసేన 67, కాంగ్రెస్ 42, ఎన్సీపీ 47, ఇతరులు 21 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హరియాణా ఎన్నికల ఫలితాల సరళిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పరిశీలన. సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ఢిల్లీకి రావాలని ఆదేశం.
మహారాష్ట్రలోని శవ్రీ స్థానంలో శివసేన అభ్యర్థి 52,000 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.