అమ్మకానికి శ్రీచైతన్య విద్యాసంస్థలు–డీల్ ఎంతో తెలుసా

SMTV Desk 2019-10-23 16:15:00  

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా తమ విద్యా సంస్థలను స్థాపించిన శ్రీచైతన్య విద్యాసంస్థలను త్వరలోనే మరో సంస్థ కొనుగోలు చేయనుండా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రతిష్టాత్మక శ్రీచైతన్య విద్యా సంస్థలను ఎవరు కొనుగోలు చేస్తున్నారు? ఇంతకు కొనుగోలు చేస్తున్నారు తెలుసుకోవాలంటే..
*1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలు ప్రారంభం
శ్రీచైతన్య విద్యాసంస్థలు ఉమ్మడి అంధ్రప్రదేశ లో విజయవాడ కేంద్రంగా 1986లో ప్రారంభించారు. ముందుగా బాలికల కాలేజిలో ప్రారంభమై తమ మార్క్ ను చూపించాయి. ఈ విద్యాసంస్థలను ప్రారంభించింది డాక్టర్ బొప్పన లక్ష్మిబాయ్ ప్రస్తుతం శ్రీచైతన్య స్కూల్స్ వివిధ రాష్ట్రాల్లో దాదాపు ఏడు వందల ఉన్నాయి. ఇప్పుడు ఈ సంస్థలను మరో ప్రేవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ బ్రూక్ ఫీల్డ్ కల్పాతీ ఇన్వెస్ట్మెంట్స్ సస్మ్త కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. నర్సరీ నుండి ఇంటర్ వరకు ఇన్న శ్రీచైతన్య స్కూళ్ళను మొత్తం 1.1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. ఏమ్నిమిది వేల కోట్లు కొనుగోలు చేసేందుకు ప్రెవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ బ్రూక్ ఫీల్డ్ అండ్ కల్పాతీ ఇన్వెస్ట్ మెంట్స్ సంస్థ ఆసక్తి చూపుతున్నట్లు జాతీయ పత్రికల్లో కధనం ప్రచురితమైంది.
*ఆసక్తి చూపుతున్న కల్పతి ఇన్వెస్ మెంట్స్, బ్రూక్ ఫీల్డ్ ?
ఈ ప్రక్రీయలో భాగంగానే చెన్నైకు చెందిన కల్పతి ఇన్వెస్ట్ మెంట్స్ సంస్థ శ్రీచైతన్య స్కూళ్ళను కొనుగోలు చేసేందుకు పావులు కదిపింది. అయితే కొన్ని కారణాలతో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ప్రేవేట్ ఈక్విటీ సంస్థ బ్రూక్ ఫీల్డ్ తెరపైకి వచ్చింది. శ్రీచైతన్య స్కూళ్ళను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రెండు పార్టీల నుంచి రాలేదు. కల్పతి ఇన్వెస్ట్ మెంట్స్ డైరెక్టర్ సురేష్ కూడా దీనిపై కామెంట్ చేసేందుకు అందుబాటులో లేరు. అయితే ఈ స్థాయిలో స్కూళ్ళను ఇంత భారీ మొత్తంలో కొనుగోలు చేయాలంటే మామూలు విషయం కాదు. దీనికోసం పలు ప్రభుత్వ ఏజెన్సీలు నుంచి అనుమతులు రావాల్సి ఉంది. మొత్తానికి ఇలాంటి పెద్ద విద్యాసంస్థలను కొనుగోలు చేసే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.