గంగూలీ నయా ఇన్నింగ్స్‌లో దూసుకుపోవాలి

SMTV Desk 2019-10-23 16:08:29  

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గంగూలీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాల సంఘాలను కలుపుకుంటూ.. వాటి సమస్యల్ని అధిగమించాలి. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో చిక్కుకున్న భారత జట్టుకు ఊపిరి పోసిన గంగూలీ ఇప్పుడు బీసీసీఐని ఎలా నడిపిస్తాడో అని క్రికెట్‌ వర్గాల్లో నెలకొంది. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్‌ ముఖచిత్రంగా ఎదిగిన గంగూలీని నయా ఇన్నింగ్స్‌లో దూసుకుపోవాలని మాజీ క్రికెటర్లు కోరుకుంటున్నారు.