అవికా గౌర్‌కు ఎదురైన చేదు అనుభవం!!

SMTV Desk 2019-10-23 16:07:54  

సాధారణంగా సినిమా హీరోయిన్లు ఎల్లప్పుడూ గ్లామరస్‌గా కనిపించేందుకే ఇష్టపడతారు. సినిమాల్లోనే కాదు.. బయట కనిపించే ఫంక్షన్లలోనూ గ్లామర్ విందు చేస్తుంటారు. ప్రేక్షకులు కూడా హీరోయిన్లను అలా చూసేందుకే ఇష్టపడుతుంటారు. అయితే అవికా గౌర్‌కు మాత్రం ఓసారి భిన్నమైన అనుభవం ఎదురైందట. ఓ ఫంక్షన్‌కు పొట్టి బట్టలు వేసుకుని హాజరైనందుకు ట్రోలింగ్ ఎదురైందట.

"గతంలో ఒక ఈవెంట్‌కు స్కర్ట్ వేసుకుని వెళ్లా. చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకలా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావ్ అని కొందరు ట్రోలింగ్ చేశారు. స్కర్ట్ వేసుకున్నందుకే అలా ఎందుకు తిడుతున్నారు అనిపించింది. ఆ తర్వాత అర్థమైంది.. ప్రేక్షకులు నన్నెప్పుడూ అలా చూడలేదు. అందుకనే అంతలా రియాక్ట్ అయ్యారని అనిపించింద"ని అవికా చెప్పింది. అలాగే ఇకపై కథలో భాగంగా గ్లామరస్‌గా కనిపించేందుకు సిద్ధమేనని, సన్నివేశాన్ని బట్టి అందాల విందు చేస్తానని చెప్పింది.